Friday, May 17, 2024

జ‌య‌శంక‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఎమ్మెల్సీ క‌విత

మేడ్చ‌ల్ – తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సార్ నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు. జయశంకర్‌ సార్‌ అందరికీ స్ఫూర్తి ప్రధాత.. అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారన్నారు. మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో మంత్రి మల్లారెడ్డితో కలిసి అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ . ఆచార్య జయశంకర్‌ సార్‌ పుట్టినరోజున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎక్కడా అధైర్యపడలేదని చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భుజం తట్టి ఉద్యమ పోరాటాన్ని జయశంకర్ సార్ ముందుకు తీసుకెళ్లారని ఆమె కొనియాడారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేసినప్పుడు జయశంకర్ సార్ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ప్రతి పైసా లెక్క రాసి పెట్టారని ఆమె చెప్పారు.సమాజంలో ప్రతి తెలంగాణ వారి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించిన జయశంకర్ సార్ రాష్ట్రం ఏర్పాటు కాకముందే మన నుండి దూరం కావడం బాధాకరమని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు

.ఈ కార్యక్రమంలో దేవి ప్రసాద్.మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి.మేడ్చల్ ఎంపీపీ వీర్లపల్లి రజిత రాజ మల్లారెడ్డి.జెడ్పిటిసి శైలజ విజయనందారెడ్డి.మాజీ జడ్పిటిసి శైలజ హరినాథ్.బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి.గుండ్లపోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్.మున్సిపల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెరువుకొమ్ము శేఖర్ గౌడ్.రైతుబంధు జిల్లా అధ్యక్షులు నారెడ్డి నందా రెడ్డి.మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్.జయశంకర్ సార్ విగ్రహ కమిటీ సభ్యులు అడ్వకేట్ ప్రవీణ్ కుమార్.చిదు వీరభద్ర రెడ్డి.కంకణాల సత్యపాల్ రెడ్డి.మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ దయానంద్ యాదవ్.మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ లో జాకట దేవరాజ్.కౌడే మహేష్ కురుమ.ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి.పానుగంటి సుహాసిని.నడికొప్పు ఉమా నాగరాజు ముదిరాజ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి.జంగ హరికృష్ణ యాదవ్.బత్తుల శివకుమార్ యాదవ్.తుడుం గణేష్. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి.గీతా మధుకర్. మేడ్చల్ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహ రెడ్డి.నాయకులు సాటే నరేందర్.నడికొప్పు నాగరాజు ముదిరాజ్.మధుకర్ యాదవ్.జి నరేందర్ శైలేందర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు….

Advertisement

తాజా వార్తలు

Advertisement