Monday, May 6, 2024

TS: జంప‌న్న వాగు…జ‌న‌సంద్రం

రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఈ ఏడాది వైభవంగా జరుగుతోంది. జాతరలో రెండోరోజు గురువారం మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం సాగుతుంది.

ఆనవాయితీ ప్రకారం ముందుగా జంపన్న వాగుకు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరిస్తూ, తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల పూనకాలతో జంపన్న వాగు పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. నిరంతరం అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement