Saturday, May 4, 2024

Invitation – ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్సీ క‌విత‌కు ఆహ్వానం…

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు యూకేలోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 30న యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో ‘డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌’ అనే అంశంపై ఆమె ప్రసంగించనున్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫ‌ర్డ్ యనివర్సిటీ కీలకోపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా ఆహ్వాన లేఖ‌లో వ‌ర్శిటీ కోరింది. దీంతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement