Friday, May 3, 2024

కాంగ్రెస్‌ హయాంలోనే మహిళలకు ఇంపార్టెన్స్​.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చిన్న చూపు: రేవంత్​రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సమాజాభివృద్ధిలో మహిళల ప్రాధాన్యత మరువలేనిదని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, చట్టసభల్లోనూ అత్యున్నత ప్రాధాన్యత కల్పించిందని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మహిళా రిజర్వేషన్‌ తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తామన్నారు. సోమవావరం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహిళాదినోత్సవ వేడుకలు నిర్వహించారు. 12 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని , అందుకు ప్రతి ఒక్కరు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్‌రడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముగ్గురు మహిళల ప్రాధాన్యత ఉందని, అందులో సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్‌, మీరాకుమార్‌ వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. అరుగురు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించిందని ఆయన గుర్తు చేశారు.

యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ, రాష్ట్రపతిగా ప్రతిబాపాటిల్‌, లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌లకు అవకాశం కల్పించిందన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడు అవకాశం వచ్చినా మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ కోసం సోనియాగాంధీ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తే.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మహిళా బిల్లును తొక్కిపట్టారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలో మహిలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఇద్దరు మహిళలు ఉన్నా.. పవర్స్‌ మాత్రం ప్రగతిభవన్‌లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో ప్రోత్సహించినదన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు..
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. నగరం నడిబొడ్డున సింగరేణి కాలనీలో ముక్కుపచ్చలారని చిన్నారి హత్యకు గురైన సంఘటన ఎంతో కలిచి వేసిందన్నారు. రాష్ట్రంలో తాగుబోతులను తయారు చేసి మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. గల్లిdలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని తెలిపారు. కేసీఆర్‌ తాగుడుకు రోల్‌ మోడల్‌గా మారాడని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం కోసం పోరాటం చేయాలని, మహిళలకు పెద్ద ఉంటుందన్నారు. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement