Wednesday, May 1, 2024

TS : వంద రోజుల్లోపు నాలుగు గ్యారంటీలు అమలు చేశాం…మంత్రి శ్రీధర్ బాబు

కర్మన్ ఘాట్, మార్చి 4 (ప్రభ న్యూస్): రాష్ట్రంలోని నిరుపేద ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కర్మన్ ఘాట్‌లోని శ్రీ హరియర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి శాలువతో సత్కరించారు.

జగద్గురు శ్రీశ్రీ శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య భారతి వారి అనుగ్రహంతో దేవాలయం అన్ని విధాలుగా అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు 100 రోజుల్లోపే నాలుగు గ్యారంటీలు అమలు చేసినట్లు తెలిపారు. మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ నిరుపేదలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తు ఫ్రీ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మంత్రి వెంట రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, చంపాపేట హస్తినాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, దెండి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేదిరే యోగేశ్వర్ రెడ్డి, కొక్కొండ సూర్య ప్రకాష్ గుప్తా ,డేరంగుల కృష్ణ ,ప్రభాకర్ రెడ్డి , ప్రవీణ్ రెడ్డి, సుధీర్ రెడ్డి , గౌని అనసూయ గోపాల్ ముదిరాజ్, ఆలయ కమిటీ ధర్మకర్తలు చైర్మన్ వంగా చంద్రారెడ్డి ,సద్ది సందీప్ రెడ్డి ,విజేశ్వర్ రెడ్డి, మిర్యాల అంజయ్య గుప్తా, కొక్కొండ సూర్య ప్రకాష్ గుప్తా, మల్లికార్జున్ గుప్తా ,బిక్షపతి గౌడ్, జగనే రమేష్ గుప్తా, జగిని శ్రీనివాస్ గుప్తా లంకెల రమేష్ రెడ్డి ,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవ శుభ పత్రికను ఆవిష్కరించిన మంత్రి….
శ్రీ హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ మరియు శ్రీ రామలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన 13వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి సమక్షంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్న సందర్భంగా దేవాలయం చైర్మన్ వంగ చంద్రారెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తలు సభ్య సందీప్ రెడ్డి, విజేశ్వర్ రెడ్డి, మిర్యాల అంజయ్య గుప్తా, కొక్కొండ సూర్య ప్రకాష్ గుప్తా, లంకెల రమేష్ రెడ్డి, జెగిని శ్రీనివాస్ గుప్తా, జిగిని రమేష్ గుప్తా బిక్షపతి గౌడ్ , సుంకరి రమేష్ గౌడ్, కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి , యోగేశ్వర్ రెడ్డి ,శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి ,జెక్కిడి ప్రభాకర్ రెడ్డి ,మల్లికార్జున గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement