Thursday, May 2, 2024

Khammam: నోరు అదుపులో పెట్టుకో.. పొంగులేటికి బీఆర్ఎస్ నేతల వార్నింగ్..

ఖమ్మం : పొంగులేటి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించిన పలు సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పిచ్చికూతలు కూసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముస్తఫా లపై ఖమ్మం బీఆర్ఎస్ మైనారిటీ భాగం నాయకులు ద్వజమెత్తారు. వీడీఓస్ కాలనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజ్ఉద్దీన్, కార్పొరేటర్ మక్బూల్, మాజీ లైబ్రరీ చైర్మన్ ఖమర్, మాజీ కార్పొరేటర్ షౌకత్ అలీ, నాయకులు ఎస్కే ముక్తార్, మజీద్, ముజాహిద్, మెహబూబ్ అలీ, షేక్ షకీన, షంశుద్దిన్ మాట్లాడారు.. స్థాయి మరిచి మంత్రి పువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడనికి సిద్దంగా లేమన్నారు. పిచ్చి పిచ్చి కూతలు, పొంతనలు లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఈసారి గెట్టిగానే సమాధానం చెబుతానని హెచ్చరించారు.

ప్రజా సేవలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గడచిన 9 సంవత్సరాల్లో ఖమ్మం నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూశారుగా.. ఇంకా మీరొచ్చి కొత్తగా చేసేది ఏముంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో కలిసి ఉన్న వారికే మళ్ళీ కండువాలు కప్పుకుని వారినే చేర్చుకుని చేరికలు అని పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడానకి ఎవరు సిద్దంగా లేరని, చేర్చుకున్న వారు పేర్లు ఎందుకు వెల్లడించలేదన్నారు. వార్డు స్ధాయికి ఎక్కువైన వ్యక్తి ముస్తఫా కనీసం సమాజంలో వ్యక్తిగా ఉన్న వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టరా..? నేరాలు చేస్తే కేసులు పెట్టరా..? ప్రజలకు ఇబ్బందులు కలిగించి వారిని మోసగిస్తే కేసులు పెట్టారు అని ప్రశ్నించారు.

మిమ్మల్ని ప్రజలు ఈసడించుకుంటుంటే.. ఎందుకు పాకులాడుతురో ప్రజలకే అర్దం కాట్లేదన్నారు. మీ గడియారంలో టైం ఎప్పటికీ రాదు.. బ్రమల్లో జీవించడం మానేసి వాస్తవంలోకి రండి ఆన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల గుండెల్లో ఉంది.. దాన్ని వేరు చేయాలనే మీ ప్రయత్నం వృధా.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చేపట్టిన వాడ వాడ పువ్వాడతో అనేక సమస్యలు సమసిపోతాయి.. చిన్న చిన్నవి, దీర్ఘకాలిక సమస్యలు సైతం పూర్తిగా పరిష్కరిస్తున్నారు మంత్రి పువ్వాడ.. దాన్ని అడ్డుకుంటాం అని అంటున్నారు.. మీకు మేము కాదు ప్రజలు ఉరికించి కొడతారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement