Friday, November 15, 2024

50 వేల కొలువుల భ‌ర్తీకి వీడ‌ని చిక్కులు

రెండు కొత్త జిల్లాలు
జోన్లలో పూర్తి కాని మార్పులు, చేర్పులు
రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురు చూపులు
కేంద్రహోంశాఖ వద్ద ఆగిన దస్త్రం
న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్‌లు జారీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, : రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, ఆమోదం పొందిన జోన్లలో మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డాకే ప్రభుత్వం ప్రతిపాదించిన 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టి జోన్లుగా అప్పట్లో ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ఆమోదించగా రాష్ట్రపతి ఇందుకు సన్నద్ధత వ్యక్తం చేస్తూ ఉత్తర్వులిచ్చారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చారు. ఈ సంద ర్భంగా 2019లో ములుగు, నారాయణపేట జిల్లాలు పని చేయడం ప్రారంభించాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 31 నుంచి 33కు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండగా తెలంగాణలో పది జిల్లాలుండేవి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తొలుత 31 జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ తర్వా త మరో రెండు జిల్లాలను చేర్చింది. రెండు కొత్త జిల్లాలు, జోన్ల లో మార్పులు చేసినప్పటికీ రాష్ట్రపతి ఈ ప్రతిపాదనపై ఇంకా ఆమోదముద్ర వేయలేదు. దీంతో ఉద్యోగాల భర్తీకి సంబం ధించి నోటిఫికేషన్ల జారీ ఆలస్యమయ్యే సూచనలు కనిపి స్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వకుండా నోటిఫికేషన్లను జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం నిర్ణ యించిన 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటే ఉమ్మడి రాష్ట్ర ంలోని ఐదు, ఆరు జోన్ల మాదిరిగానే నోటిఫికేషన్లు ఇవ్వవలసి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
నారాయణపేట, ములుగు రెండు జిల్లాలను ఉత్తర్వుల్లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందని దీనికి తోడు వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లోకి బదలా యించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగ, ప్రవేశాలకు సంబంధించి స్థానికులకే ఎక్కువ అవకాశాలు లభించేలా రాష్ట్రపతి ఉత్తర్వు లను ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఉన్న 31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టి జోన్లుగా విభజించారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖల్లోని పోస్టు లను జిల్లా, జోనల్‌, మల్టిd జోనల్‌, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరించారు. ఈ మేరకు స్థానిక, జనరల్‌ కోటాలను విభ జించారు. ఆ తర్వాత రెండు కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పా టు చేయగా మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి నారాయణపేట, జయశంకర్‌ భూపాలప్లలి నుంచి ములుగును వేరు చేసి కొత్త జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆయా జిల్లాల వాసులకే దక్కాలంటే ఈ రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర హోంశాఖకు పంపించింది.
మొదటి జోన్‌లో కాళేశ్వరం
మొదటి జోన్‌ అయిన కాళేశ్వరం జోన్‌లో కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపా లపల్లితో పాటు ములుగు జిల్లాలను ఈ జోన్‌ పరిధిలోకి తీసు కురావాలని సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఏడవ జోన్‌ అయిన జోగులాంబలో మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలతో పాటు నారాయణపేట జిల్లాను చేర్చా లని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్‌ జిల్లాను జోగు లాంబ జోన్‌లో చేర్చడంపై స్థానికంగా నిరసన వ్యక్తమైంది. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో చేరుస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రతి పాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పాదనను కేంద్ర హోంశాఖ పరిశీలించి వాటిని పొందు పరుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుంది.
రాష్ట్రపతి ఉత్తర్వులకు ఎదురు చూపులు
50వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఒకవైపు సిద్ధమవుతూ ఆ దిశగా ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఖాళీల వివరాలను తెప్పిస్తోంది. సాగర్‌ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్‌ నగర పాల క సంస్థలతో పాటు మిగతా పురపాలక సంఘాలకు జరప నున్న ఎన్నికల అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రారంభ మయ్యేలోపే రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ ప్రక్రియ ముగిస్తే జిల్లా స్థాయి పోస్టుల్లో ములుగు, నారాయణపేట జిల్లాల వారి కి ప్రాధాన్యత దక్కుతుంది. లేని పక్షంలో అంతకు ముందున్న జిల్లాల్లో భాగంగానే పరిగణించాల్సి ఉంటుంది. అలా కాకుం డా నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కంటే ముందే కేంద్రం నుంచి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఢిల్లి కేంద్రంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వ ముఖ్య సలహా దారు రాజీవ్‌ శర్మకు ఈ బాధ్యతలను సీఎం కేసీఆర్‌ అప్పగి ంచినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగానే రాష్ట్రపతి ఉత్తర్వు లకు సవరణ పూర్తవుతుందన్న ఆశాభావంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.
పాత జిల్లాలు రెండు జోన్ల వారీగా నియామకాలు
ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగం యువతలో నిరాశ, నిస్పృ హలు ఉన్న నేపథ్యంలో పాత జిల్లాలు రెండు జోన్ల వారీగా విభజించి నియామక ప్రక్రియను చేపట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్లను పరిగణలోకి తీసుకోకుండా ఇది వరకు పది ఉమ్మడి జిల్లాలు, రెండు జోన్ల వారీగా నియా మకాలు చేపడితే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రభుత్వ వర్గా లు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడి పది జిల్లాల వారీగా నియామకాలు చేపడితే కొత్తగా ఉత్తర్వులను వెలువరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని తద్వారా నియామకాలకు బ్రేక్‌ పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల వరకు వేచి చూడడమా లేక నియామకాలపై ముందుకు వెళ్లడమా అనేది త్వరలోనే తేలుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కొత్త జోన్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్న ప్రచారం కూడా లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement