Saturday, July 27, 2024

కేసీఆర్ సీఎం అయ్యాకే మ‌హిళ‌ల అభ్యున్న‌తికి ప్రాధాన్య‌త : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

కేసీఆర్ సీఎం అయిన తర్వాత మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నార‌ని, అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమ‌ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కర్మాన్ ఘాట్ లోని ఎన్బీఆర్ కన్వెన్షన్ హాల్లో భాగ్యనగర్ మహిళ సంఘం నూతన ఫౌండర్ టీమ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తో కలిసి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసంద‌ర్భంగా ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… గ‌తంలో ఉన్న‌
ప్రభుత్వాలు మహిళలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ, అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇస్తూ రాజకీయపరంగా మహిళలకు పదవులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, సత్యవతి రాథోడ్, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అనేక రకాలైన పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేన‌న్నారు. భాగ్యనగర్ మహిళా సంఘం వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకున్న వారికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ ద్వారా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ఉప్పల నిర్మల, జనరల్ సెక్రెటరీ ప్రశాంతి గుప్తా, ట్రెజరర్ పావని, రాజశ్రీదేవి, శ్రీవాణి చౌదరి, శైలజ, సత్యకుమారి, పద్మా రెడ్డి, సరోజ, భారతమ్మ, విజయలక్ష్మి, శారద, విజయలక్ష్మి, రామలక్ష్మి, వరలక్ష్మి, రూప, సుమలత, జయంతి, మంజుల, అనురాధ, ధనలక్ష్మి, శోభారాణి, కళ్యాణి, విమల రెడ్డి, అనిత, విజయలక్ష్మి, రూప, జాగృతి, కిరణ్మయి, రాజేశ్వరి, గిరిజ, మహిళా సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement