Tuesday, June 18, 2024

TS : హైద‌రాబాద్ జూలో తెల్ల పులి మృతి..

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో అరుదైన తెల్ల పులి మృతిచెందింది. రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం ( మే 14) ప్రాణాలు విడిచింది. బద్రి, సురేఖ అనే పులులకు 2015 జనవరి 2న ఈ పులి జన్మించింది. దీనికి అభిమన్యు అని పేరు పెట్టగా.. ప్రస్తుతం దాని వయస్సు తొమ్మిదేళ్లు. అయితే ‘అభిమన్యు’కు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు నెహ్రూ జూ అధికారులు గుర్తించారు.

ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న అభిమన్యుకు గత కొన్నిరోజులుగా అన్ని రకాల వైద్యసేవలు అందించారు. ట్రీట్‌మెంట్ కోసం వీబీఆర్‌ఐ, వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి అభిమన్యు ఆహారం తీసుకోవటం తగ్గించింది. గత మూడు రోజులుగా జూలోనే మందులతో పాటు ద్రవ ఆహారం అందిస్తూ చికిత్స కొనసాగించినా.. ఫ‌లితం లేక‌పోయింది. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉండగా.. అందులో తెల్ల పులులు 8 ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement