Tuesday, April 23, 2024

పట్టణ ప్రగతిని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి : గద్వాల్ విజయలక్ష్మి

ప్రతిష్టాత్మక పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈనెల 20వ తేదీ నుండి జూన్ 5 వరకు వార్డుల పరిధిలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…. పట్టణ ప్రగతి కార్యక్రమం వల్ల‌ అభివృద్ధి పనులకు ప్రణాళిక. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి నగరంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి దోహదపడుతుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి అవగాహనతో పాటు ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనికిరాని వస్తువులు, నిర్మాణ వ్యర్థాల కోసం తాత్కాలిక పాయింట్ గుర్తించి సేకరించిన మొత్తాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కల చుట్టూ కలుపు తీయడం, మట్టి పోయడం, ఎండిపోయిన మొక్క స్థానంలో మరొక మొక్క నాటాలని, పబ్లిక్ కన్వినేన్స్ , ఇన్స్టిట్యూషన్ లో నీరు నిలువకుండా చర్యలతో పాటు పరిశుభ్రంగా ఉండాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, తహశీల్దార్, శానిటేషన్ యూబీడీ, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement