Monday, April 15, 2024

చేనేత రంగానికి పెద్ద‌పీట‌.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేనేత రంగంతో పాటు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ముఖ్యంగా చేనేత రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలనే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు..ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించడం జరుగుతుందన్నారు. చేనేత వస్త్రాలు ధరించి, చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే సదుద్దేశంతో.. చేనేత కార్మిక రంగానికి ఉపాధి కల్పించే దిశగా.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నేడు కూడా చేనేత వస్త్రాలు ధరించడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement