Thursday, May 23, 2024

TS : బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

బిల్డింగ్ పై నుంచి దూకి ఓ విద్యార్థినీ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్మిక నగర్ కు చెందిన చిత్రశివాని.. కాప్రా సర్కిల్ సాయినగర్ లో డబుల్ బెడ్ రూం ఇంటిపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

జవహర్​నగర్ పరిధిలోని కార్మిక నగర్​కు చెందిన గంగారపు మనోహర్ కుమార్తె చిత్ర శివాని(18). ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజులానే కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కాప్రా సాయినగర్​లోని రెండు పడకల భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

- Advertisement -

స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్​ను పిలిపించారు. అయితే విద్యార్థిని అప్పటికే మృతిచెందినట్లుగా వారు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్ర శివాని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement