Wednesday, May 22, 2024

ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం ఆమ‌ర‌ణ దీక్ష చేద్దాం -కెటిఆర్ కి రేవంత్ పిలుపు

హైద‌రాబాద్ – యుపిఎ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ప్ర‌క‌టించిన ఐటిఐఆర్ ప్రాజెక్ట్ సాధించేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇద్ద‌రం ఆమరణ దీక్ష చేద్దామని కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మంత్రి కెటిఆర్ కు పిలుపు ఇచ్చారు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి చిన్నారెడ్డి త‌రుపున ఆయ‌న నేడు కూక‌ట్ ప‌ల్లిలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్టు రాలేదని మంత్రి కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిప‌డ్డారు. ఇక్కడ కూర్చొని డైలాగులు చెపితే సరిపోదని… ఈ ప్రాజెక్టు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేద్దామని ర‌మ్మ‌ని సవాల్ విసిరారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీతో కేసీఆర్ ఎందుకు దోస్తీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు వంటివారని విమర్శించారు. లక్షా 91 వేల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement