Monday, February 26, 2024

ఎవరెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఫ్యాట్‌ స్కాన్‌ మిల్క్‌ ఎనలైజర్‌ విడుదల

డెయిరీ సాంకేతిక పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఎవరెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ తమ తాజా ఉత్పత్తి ఫ్యాట్‌స్కాల్‌ మిల్క్‌ ఎనలైజర్‌ను విడుదల చేసింది. ఈ ప్యాట్‌ స్కాన్‌ మిల్క్‌ ఎనలైజర్‌ విప్లవాత్మక సాంకేతికతను వినియోగించుకుని ఖచ్చితమైన, సమర్థవంతమైన విశ్లేషణను పాల నాణ్యత గురించి అందిస్తుంది. ఈసందర్భంగా ఎవరెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ పటేల్ మాట్లాడుతూ… ఈ ఫ్యాట్‌స్కాన్‌ మిల్క్‌ ఎనలైజర్‌ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ఖచ్చితమైన ఫలితాలను వాస్తవ సమయంలో పొందవచ్చన్నారు. దీంతో పాల ఉత్పత్తిదారులు, ప్రాసెసర్లు పాల నాణ్యత పట్ల తగిన నిర్ణయాలను తీసుకుని తమ సామర్థ్యం, లాభాలను మెరుగుపరుచుకోగలరన్నారు. మిల్క్‌ ఎనాలిసిస్‌ పరిశ్రమను ఈ వినూత్నమైన సాంకేతికత విప్లవాత్మీకరించనున్నామన్నారు.

ఎవరెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పరిమల్ పటేల్ మాట్లాడుతూ… ఇప్పటి వరకూ మిల్క్‌ ఎనలైజర్‌లను యూరోప్‌ నుంచి దిగుమతి చేసుకునే వారన్నారు. ఫ్యాట్‌స్కాన్‌ మిల్క్‌ ఎనలైజర్‌ను భారతదేశంలో అభివృద్ధి చేసి విడుదల చేశామన్నారు. పాలు, పాల పదార్ధాల నాణ్యతను మెరుగు పరచడంతో పాటుగా వినియోగదారులకు భద్రతను సైతం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement