Wednesday, February 21, 2024

HYD: జెన్3 నోవా శ్రేణి ఎలివేటర్ల కోసం ఆన్‌లైన్ ఆర్డర్-బుకింగ్‌ను అందిస్తున్న ఓటిస్ ఇండియా

హైద‌రాబాద్ : భారత దేశంలోని భవన యజమానులు, ఫెసిలిటీ మేనేజర్లు ఇప్పుడు డిజిటల్‌గా కనెక్ట్ చేయబడిన జెన్ 3 నోవా ఎలివేటర్‌ని ఓటిస్ ఇండియా ఇ-కామర్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఓటిస్ ఇండియా అనేది ఎలివేటర్, ఎస్కలేటర్ తయారీ, సంస్థాపన, సేవలకు సంబంధించి ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఓటిస్ వరల్డ్ వైడ్ కార్పొరేషన్ కు చెందిన అనుబంధ సంస్థ.

ఈ సందర్భంగా ఓటిస్ ఇండియా ప్రెసిడెంట్ సెబి జోసెఫ్ మాట్లాడుతూ… ఎలివేటర్ల ప్రత్యక్ష విక్రయం కోసం త‌మ ఇ-కామర్స్ పోర్టల్‌కు జెన్3 నోవా శ్రేణిని జోడించడానికి తాము సంతోషిస్తున్నామ‌న్నారు. జెన్3 ఎలివేటర్‌లు ఓటిస్ వన్ ఐఓటీ సిస్టమ్‌ల ద్వారా అందించబడతాయన్నారు. ఇవి కొనుగోలు దారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయన్నారు. ఈ ఆన్‌లైన్ బుకింగ్ కార్యక్రమం త‌మ కస్టమర్‌లకు అనుకూలమైన, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో త‌మ నిబద్ధతకు నిదర్శనమ‌న్నారు. ఈ డిజిటల్ ప్రయాణం త‌మ కస్టమర్లకు విలువను సృష్టిస్తుందని, ఓటిస్‌తో వారి మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తాము నమ్ముతున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement