Monday, April 29, 2024

జర్నలిస్టుల ఇళ్ల పట్టాల సమస్య ప‌రిష్క‌రిస్తా.. మంత్రి కేటీఆర్ హామీ

ఉప్పల్ మండల పరిధిలోని ఉప్పల్, నాచారం, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2008 సంవత్సరంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఉప్పల్ మినీ శిల్పారామం వద్ద జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత హస్తకళల మ్యూజియం భవనానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలిసి జర్నలిస్టుల ఇళ్ల పట్టాల సమస్యతోపాటు ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవనం విషయంపై వినతిపత్రం అందజేశారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రాబోయేది మళ్లీ తెలంగాణ ప్రభుత్వమేనని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఉప్పల్ జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చిన స్థలాన్ని పరిశీలించాలని కలెక్టర్ ను ఆదేశిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వము అండగా ఉంటుందని తెలిపారు.

ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ హామీ

ఉప్పల్ ప్రధాన రహదారిలో దశాబ్దాల క్రితం నుంచి ఉన్న ఉప్పల్ ప్రెస్ క్లబ్ తాత్కాలిక భవనం స్థానంలో కొత్త భవనం నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు అండగా ఉంటామని, ప్రెస్ క్లబ్ సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయు ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజు సురేష్, ఏవీ శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి గుత్తి శేఖర్, ముఖ్య సలహాదారులు కె. చంద్రమౌళి, ఎం. రాం ప్రసాద్ శర్మ, డి.సురేష్, వి.కిషోర్, ఎం.శ్రీశైలం జర్నలిస్టులు రమేష్, నరసింహ రెడి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement