Tuesday, May 7, 2024

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం : ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, ముసరం బాగ్ డివిజన్, శాలివాహన షటిల్ గ్రౌండ్స్ లో బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన 17వ ఇన్విటేషనల్ రిపబ్లిక్ డే బ్యాట్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిధిగా హాజ‌రై ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న 17వ ఇన్విటేషనల్ రిపబ్లిక్ డే బ్యాట్మింటన్ టోర్నమెంట్ లో 130 టీంలు పోటీ పడనున్నారు. తెలంగాణ లోని పలు జిల్లాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొననున్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తని షీల్డ్ బహుకరించి శాలువాతో సన్మానించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. శారీరక శ్రమతో కూడిన క్రీడలు ఆరోగ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా.. పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ క్రీడలు క్రీడాకారులకు ఆనందం, ఆరోగ్యం తో పాటు అందరికి స్పూర్తి గా ఉంటుంది అన్నారు. ఇలాంటి ఆరోగ్యవంతమైన సమాజ లక్ష్యంగా ఉన్నత ఆశయంతో ఏర్పడిన బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ 17 ఏళ్ళుగా అంకితభావంతో పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.

క్రీడాకారులుగా మీరు సాధించిన ప్రతి విజయం ఇతరులకు ఆదర్శం ఉండాలని, అదే విధంగా వారిని ప్రోత్సాహించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలు ప్రతి ఒక్కరూ తీసుకొవాలని సూచించారు. ఆరోగ్యవంతంగా జీవించాలంటే అనవసరమైన విషయాలు వదిలేసి మంచి అలవాట్లు, సమయపాలన తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతున్నదని అన్నారు. అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా పని చేస్తూ క్రీడలకు, క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జిల్లాకు, ఒక నియోజకవర్గ పరిధిలో ఒక స్టేడియం కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. క్రీడాకారులు మంచిగా ఆడి, క్రీడల్లో రాణించి విజయం సాధించి, దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కి మంచి పేరు తేవాలని కోరారు. నాకు కూడా క్రీడలు అంటే ఇష్టమని, క్రీడలకు, క్రీడాకారులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ బ్యాట్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ముషరంబాగ్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి , బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సామ ప్రభాకర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement