Tuesday, April 23, 2024

TS | తెలంగాణలో భారీగా ఎస్ఐల బదిలీ..

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఇటీవల భారీగా డీఎస్పీల బదిలీలు అయ్యారు. కాగా, తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున ఎస్‌ఐల బదిలీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మొత్తం 104 మంది సబ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ లో 63, సైబరాబాద్ కమిషనరేట్ లో 41 మంది ఇన్స్పెక్టర్లకు స్థాన చలనాలు జరిగాయి. సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ లో విధుల నిర్వహిస్తున్న సొమవరపు శ్రీనివాస్ చారి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు, సెంట్రల్ క్రైం స్టేషన్ ఎస్ఐను బహదూర్ పురా పీఎస్ కు ట్రాన్స్వర్ చేశారు. కేబీహెబ్ ఎస్ఐ ను రాయ్ దుర్గ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రస్తుత పీఎస్ ల నుంచి కొత్తగా పోస్టింగ్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో వీరు రిపోర్ట్ చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement