Sunday, May 5, 2024

HYD: రాబోయే ‘హిస్టరీ హంటర్‌’ ఎపిసోడ్‌లో గోల్కొండ కోట ముందు ఎలా ఉంటుందో ఆవిష్కరించిన మనీష్‌ పాల్‌

హైదరాబాద్‌ : రాబోయే హిస్టరీ హంటర్‌ ఎపిసోడ్‌లో గోల్కొండ కోట అసాధారణ చరిత్రను ఆవిష్కరించి, అది చారిత్రక వజ్రాల జన్మస్థలంగా నిలవడమే కాకుండా, అద్భుతంగా నిలిచిన మధ్యయుగ కోట అని, దాని వెనుక దాగివున్న రహస్యాలను ఆవిష్కరించారు. ఏడవ ఎపిసోడ్‌ జనవరి 1న రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్‌, డిస్కవరీ ప్లస్‌లో ప్రసారమవుతుంది. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ వారి హిస్టరీ హంటర్‌ సిరీస్‌లో భాగంగా మనీష్‌ పాల్‌ భారత దేశంలోని పురాతన ఇతిహాసాలు, కథలను వెలికితీసే ఉత్తేజకరమైన ప్రయాణం కొనసాగుతోంది.

ముఖ్యంగా రాబోయే ఎపిసోడ్‌లో కోహినూర్‌, హోప్‌డైమండ్‌, దరియా-ఇ-నూర్‌తో సహా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ వజ్రాల జన్మస్థలమైన హైదరాబాద్‌లోని గోల్కొండ కోట రహస్యాలను వెల్లడించనున్నారు. ఈ కోట 16వ శతాబ్దంలో అద్భుతమైన శాస్త్రీయ నైపుణ్యానికి, చుట్టు-పక్కల ప్రాంతాలను రక్షించడానికి సిబ్బందిని చాకచక్యంగా మోహరించడంతో తిరుగులేనిదిగా పరిగణించబడింది. గోల్కొండ అంటే గొల్లకొండ అని అర్థం. దీని మూలాలు 1186లో ఒక గొర్రెల కాపరి ఈ కొండపై ఒక విగ్రహాన్ని కనుగొనడంతో ప్రారంభమయ్యాయి. 16వ శతాబ్దంలో ప్రపంచ వజ్రాల రాజధానిగా పరిగణించబడిన ఈ కోట తూర్పు, పశ్చిమ తీరాల మధ్య వాణిజ్య కేంద్రంగా పని చేసింది. ఈ కోటలో 8 ద్వారాలు, 87అష్టభుజి ఆకారపు చిన్న కోటలు, కుతుబ్‌ షాహీ రాజవంశం వారు వ్యూహాత్మకంగా నిర్మించిన 100 ఫిరంగులు ఉన్నాయి. ఇది అధునాతన రక్షణ వ్యవస్థ, అసాధారణమైన నీటి సరఫరా ప్రణాళికతో ఆ కాలంలో ఒక గొప్ప సుల్తానేట్‌ గా పరిగణించబడింది. ఇవేకాకుండా రాబోయే ఎపిసోడ్‌ లో ఈ కోటలోని బాల హిస్సార్‌ గేట్‌. ఇది 400 సంవత్సరాల క్రితం ప్యాలెస్‌ లోపల ఎన్‌క్లోజర్ల వెంట చప్పట్ల శబ్దంతో కమ్యూనికేషన్‌ జరిగే క్లాపింగ్‌ పోర్టికో విధానాన్ని దాని శాస్త్రీయ నైపుణ్యం వెనుక ఉన్న రహస్యాలను ప్రేక్షకులు తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement