Wednesday, April 17, 2024

వర్షాలు మొదలైతే రచ్చ రచ్చే.. బేగంపేట రూట్‌లో క‌ష్టాలు త‌ప్ప‌వు..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టే షన్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో రసూల్‌పూర దగ్గర అండర్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. నెలరోజులు దాటినా ఇప్పటి వరకు సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నెలరోజులుగా సికింద్రాబాద్‌ నుంచి బేగంపేటకు వచ్చే వాహనాలను సింధికాలని, రాంగోపాల్‌పేట పోలీస్‌స్టే షన్‌, మినిస్ట ర్‌ రోడ్‌ మీదుగా రసూల్‌పూర జంక్షన్‌ వరకు మళ్లించారు. ఖైరతాబాద్‌ జోనల్‌ ఆఫీసు నుంచి సోమాజిగూడ వెళ్లే ప్రధాన రహదారిలో మెట్రోస్టే షన్‌ వద్ద అండర్‌గ్రౌండ్‌ సైడ్‌ డ్రైనేజీ పనులు సైతం నెల రోజుల క్రితం మొదలయ్యాయి. ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదు. ఉదయం, సాయంత్రం పూట రద్దీ సమయాల్లో లక్‌డీకపూల్‌, ఖైరతాబాద్‌ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను ఏజీ ఆఫీసు, పాత సెక్రెటరియేట్‌, నక్లెస్‌ రోడ్‌ మీదుగా ఖైరతాబాద్‌ సర్క్‌ల్‌కు మళ్లించారు. ఇలా నగరంలో అనేక ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జీలు, డ్రైనేజీ పనులు జరుగుతున్న చోట గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో రహదారులను మళ్లిస్తున్నారు. వర్షాలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు ప్రారంభమైతే నగరం మొత్తం చిత్తడిచిత్తడవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మాన్‌సూన్‌ ప్రణాళిక అంటూ రెండు నెలల క్రితమే ఆర్భాట ం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని సకాలంలో పూర్తిచేయడంలో విఫలమవుతున్నారు.

నత్తనడకన పనులు..

స్ట్రాటిజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎస్‌ఎన్‌డీపీ) కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో 60నాలా పనులను రూ.858 కోట్లతో చేపట్టారు. జూన్‌ చివరి వరకు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతా ల్లో సగం కూడా పూర్తికాలేదు. మురుగు కాలువలు, రోడ్డు మరమ్మతులు మొదలగు మరో 371 ఇతర అత్యవసర పనులను మాన్‌సూన్‌ రాకముందే పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ గుర్తించింది. 30 సర్కిళ్ల పరిధిలో చేపట్టిన ఈ పనులు ఏప్రిల్‌లో కొన్ని మే మొదటివారంలో కొన్ని ప్రారంభమైనా ఇప్పటి వరకు 50శాతం మాత్రమే పూర్తయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక పోవడం తదితర కారణాల వల్ల పనులు నత్త నడకన నడుస్తున్నాయని తెలుస్తోంది.

పాఠాలు నేర్పని 2020 అనుభవం..

2020 భారీ వరదల అనుభవం జీహెచ్‌ఎంసీ అధికారులకు పాఠాలు నేర్ప లేదు. ఆ వరదలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. నగరంలోని రోడ్లు చెరువులు, కుంటలను తలపించాయి. ఈ సారి ఆ పరిస్థి తి రాకూడదనే ఉద్దేశంలో వర్షాకాలం రాకముందే అత్యవసర పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నప్పటికీ, ఆచరణలో జీహెచ్‌ఎంసీ విఫలమైంది. చిన్నచిన్న వర్షాలకే లోతట్టు- ప్రాంతాల్లో ఉన్న బస్తీలు, కాలనీల్లో నాలాలు పొంగిపొర్లే డ్రైనేజీ వ్యవస్థ ఉన్నందున సకాలంలో పనులు పూర్తికాకుంటే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో చేపట్టిన పనులనైనా సకాలంలో పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

శాశ్వత పరిష్కారం లేనట్టేనా.?

హైదరాబాద్‌ నగరంలో వర్షపునీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన అనేక ప్రణాళికలు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయి. ఆచరణలో అవి పూర్తిగా విఫలమయ్యాయి. 2021లో సైబరాబాద్‌ పోలీసులతో కలిసి జీహెచ్‌ఎంసీ ఓ సర్వే చేపట్టింది. సర్వే ప్రకారం నగరంలోని ప్రధాన రోడ్లు, లింక్‌రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచే 300 ప్రాంతాలను గుర్తించింది. ప్రధాన రహదారులను ఆనుకుని పూర్తిగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు 99 కాగా, 24 ప్రాంతాల్లో పాక్షికంగా నీరు నిల్వ ఉంటుందని తేల్చారు. వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైంది. ఎప్పటి లాగే మోటార్లు అందుబాటులో ఉంచి నీరు తోడేయడం తప్ప, కొత్తగా చేసేందుకు ప్రణాళిక తయారుచేయలేదు. నగరంలోని ఎఫ్‌టీఎల్‌ ఏరియాలతో పాటు ఇతర లోతట్టు ప్రాంతాల్లో గుర్తించిన నీటి నిల్వ పాయింట్లలో అండర్‌గ్రౌండ్‌, ఓపెన్‌ డ్రైనేజీలను తగిన సామర్థ్యంతో అభివృద్ధి చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా అడుగులు వేయకుండా ఈసారి కూడా తాత్కాలిక పనులవైపే జీహెచ్‌ఎంసీ మొగ్గుచూపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement