Friday, April 26, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.66.47లక్షల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈరోజు ఉదయం కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.66.47లక్షల విలువైన బంగారంను పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 2.55 గంటలకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఈరోజు తెల్లవారుజామున 3.45గంటలకు వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement