Thursday, May 2, 2024

అందత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు… మంత్రి తలసాని

అందత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగును ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని వెంగళ రావు నగర్, బంజారాహిల్స్ లోని గౌరీ శంకర్ కమిటీ హాల్ లో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా రూ.250 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నగరంలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంగా మందులు, కళ్ళద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ లు కూడా ఉచితంగా నిర్వహిస్తారన్నారు. ప్రయివేట్ లో కంటి పరీక్షకు 500 రూపాయలకు పైనే అవుతుందని, ఆపరేషన్ కు రూ.50 వేల పైనే ఖర్చవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో MLC వాణీదేవి, MLA మాగంటి గోపీనాథ్, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement