Sunday, April 14, 2024

HYD: పురుషుల ఫిజిక్‌, బాడీబిల్డింగ్‌ విభాగాల్లో విజేతలకు నగదు బహుమతి అందజేత

హైదరాబాద్‌ : మిస్టర్‌ తెలంగాణ అండ్‌ మిస్టర్‌ మహబూబ్‌ నగర్‌ షఫీ సామి బాడీబిల్డింగ్‌ అండ్‌ పురుషుల ఫిజిక్‌ ఛాంపియన్‌షిప్‌ మొదటిసారిగా మహబూబ్‌నగర్‌లో అద్భుతమైన ఫిట్‌నెస్‌ కార్యక్రమం జరిగింది. ఇటీవలే జరిగిన పురుషుల ఫిజిక్‌, బాడీబిల్డింగ్‌ విభాగాల్లో ముంబై, ఢిల్లీ, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల నుండి బాడీబిల్డర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అదనంగా, ఓవరాల్‌ విజేతలకు 50,000 నగదు బహుమతి అందించారు.

ప్రతి విభాగంలో మొదటి మూడు విజేతలలో ఒక్కొక్కరికి అందించారు. మహబూబ్‌నగర్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటంటే, మహబూబ్‌నగర్‌ యువతకు ప్రేరణ అందించడం, తద్వారా వారు ఆల్కహాల్‌, ఇతర మాదకద్రవ్యాల నుండి ఇన్‌హెల్త్‌, ఫిట్‌నెస్‌ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా దూరంగా ఉంటారు. యువతను చైతన్య పరిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, కార్వాన్‌ ఇంఛార్జి ఉస్మాన్‌ అల్హజ్రీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ జిమ్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మహబూబ్‌ నగర్‌, టీ-మ్‌ షఫీ సామి కాశీ విశ్వనాథ్‌ కట్టా, ఒబైద్‌ అల్హజ్రీ, అబ్దుల్లా అబ్సాని, షానవాజ్‌, అబ్దుల్‌ రెహమాన్‌, అల్హజ్రీ వసీం జమా, రిజ్వాన్‌, సయ్యద్‌ యూసుఫ్‌ లు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement