Thursday, October 10, 2024

HYD: మెట్టుగూడలో తప్పిన పెను ప్రమాదం..మెట్రో రైల్ డివైడర్ కు ఢీ కొట్టిన రెడీమిక్స్ లారీ..

మెట్టుగూడ మెయిన్ రోడ్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ వద్ద నాచారం ప్లాంట్ నుండి హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ సైట్ కి లోడుతో వెళుతున్న రెడ్ మిక్స్ లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడ జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఒక్కసారిగా యాక్సిడెంట్ శబ్దం రావడంతో మెట్టు కూడా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకపోగా ఘటన స్థలి నుండి లారీని వదిలేసి డ్రైవర్ భయంతో పరారైనట్టుగా చిలకలగూడ ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీధర్ శేఖర్ తెలిపారు. ఘటన జరిగిన సందర్భంలో భారీ శబ్దం రావడంతో రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంత మెట్టుగూడ ప్రజలు భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తుంది.అదేవిధంగా ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, ప్రైవేట్ ఉద్యోగులకు, సెలవు దినం కావడంతో స్థానికులు పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. చిలకలగూడ లా అండ్ ఆర్డర్ పోలీసులు లారీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అడ్మిన్ ఎస్ ఐ బాలరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement