Friday, June 14, 2024

శంషాబాద్ లో 255 గ్రాముల బంగారం స్వాధీనం

క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీలు నిర్వహించడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈరోజు 255 గ్రాముల బంగారం పట్టుబడింది. త‌నిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద 255 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 13.63 ల‌క్ష‌ల విలువ చేస్తుంద‌ని అధికారులు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్ మెట‌ల్ ఫ్రేమ్‌లో బంగారం దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. బంగారానికి వెండి పూత పూశారు. బంగారంతో ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప్ర‌యాణికుడిని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement