Monday, April 29, 2024

HBD – హైటెక్ సిటీ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

హైటెక్ సిటీ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు..నేత టీపీసీసీ వీవర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి నేత గంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.. ముఖ్యఅతిధి గా శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేశారు.

జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ…60 ఏళ్ల ఆకాంక్ష ఫలించిన దివ్య దినం….ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమిచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలకు సైతం లెక్కచే యకుండా ప్రాణ త్యాగం చేసిన కుటుంబం అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆరంభంలోనే మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణించుటకు మహిళలకు ఏర్పాటు చేయటంపై తెలంగాణ వ్యాప్తంగా మహిళలు హర్షం వక్తపరుస్తున్నారని అన్నారు..

గంజి శ్రీనివాస్ నేత మాట్లాడుతూ… సోనియా గాంధీ . భారత ప్రధాని అయ్యేవకాశం ఉన్న దేశం కోసం తృణపాయంగా వదులుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన శుభవేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరొక్కసారి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

యువనాయకులు, IT నిపుణులు నల్లపోతుల భాను ప్రకాష్ మాట్లాడుతూ… నూతన ప్రభుత్వం ఏర్పాటుపై హర్షం వక్తపరుస్తూ…ఈ క్రొత్త ప్రభుత్వం IT రంగం అద్భుతమైన ఫలితాలను అందించాలని కోరుతున్నామన్నారు .

- Advertisement -

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన్యపల్లి సాంబశివరావ్, నడిమెటి కృష్ణ, నీలం లక్ష్మీనారాయణ, సంగారెడ్డి, ఫజుల్ ఖాన్, గణేష్ యాదవ్,ప్రేమ్ కుమార్ యాదవ్, వెంకటేష్,గడ్డం సురేష్ నేత,తాటి శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement