Wednesday, July 24, 2024

TS | 15 నుంచి ఒంటిపూట బడులు.. విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు మండుతున్నాయి. దీంతో తెలంగాణలో ఒంటి పూట బడులకు వేళయ్యింది. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక, విద్యార్థులకు మధ్యాహ్నం 12.45 గంటల కల్లా మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విద్యా సంవత్సరం చివర పనిదినం ఏప్రిల్‌ 24 వరకూ అన్ని స్కూళ్లు ఇదే -టైమ్‌ టేబుల్‌ అనుసరించాల్సి ఉంటుంది. వేసని నేపథ్యంలో అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, 10వ తరగతి విద్యార్థుల విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇవ్వనుంది. ఈనెల 18 నుంచి జరగనున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 11 వరకూ వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి పాఠశాలలు జూన్‌ 12న పున:ప్రారంభం కానున్నాయి. అకడమిక్‌ ఇయర్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారమే ఈ షెడ్యూల్‌ నడుస్తుందని అధికారులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement