Sunday, June 16, 2024

TS : దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ్​…కోమ‌టిరెడ్డికి బూర స‌వాల్‌..

బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న వారిని చెప్పుతో కొడతాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు భువనగిరి లోక్ స‌భ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సవాల్ చేశారు.

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాకంటే ముందున్న ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భువనగిరి పార్లమెంట్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయాసన్యాసం చేస్తా అన్నారు.

బిఆర్ఎస్ తో పొత్తు ఎప్ప‌టికీ ఉండ‌దు..
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వర్తమానంలో లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. అలాగే భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి బీబీనగర్ ఎయిమ్స్, ఎంఎంటీఎస్ రైలు, కేంద్రీయ విద్యాలయం, 520 కి.మీ జాతీయ రహదారులు తీసుకొచ్చామని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని కోరారు.

భువనగిరి అభివృద్ధి తమ వల్లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాదు భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. నేను గెలిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని కోరారు. ఈ సవాల్‌ని స్వీకరించే దమ్ము, ధైర్యం కోమటిరెడ్డికి ఉందా అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement