Tuesday, October 1, 2024

TS : గురుకుల జేఎల్, డీఎల్ ల తుది ఫలితాలు

తెలంగాణ గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించనుంది. జూనియర్ కళాశాలలో 1,924 డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపక పోస్టులకు గత ఏడాది ఆగస్టులో రాత్ర పరీక్ష జరిగింది.

అందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఈనెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. ఈనెల 19, 20 తేదీలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డోమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి.. ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పతరాల పరిశీలన డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్హతలను గురుకుల నియామక నియామక బోర్డు మరోసారి పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అభ్యర్థి స్థానికత, కుల ధ్రువీకరణ, పీజీ, సెట్ పరీక్షలో ఎప్పుడూ ఉత్తీర్ణులయ్యారు. నోటిఫికేషన్ తేదీ నాటికి తప్పనిసరి విద్యార్హతలు అన్ని సాధించారా..? లేదా అనే వివరాలను గత రోజులుగా బోర్డు బృందాలు పరిశీలించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement