Friday, May 17, 2024

మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట.. అంగన్‌ వాడీల ద్వారా పౌష్టికాహారం అంద‌జేత‌

హౖైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మహిళలు, పిల్లల సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ నిలించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి 35700 అంగన్‌వాడి కేంద్రాల ద్వారా 2015 జనవరి నుండి ఆరోగ్యలక్ష్మి పథకం క్రింద పోషక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అంగన్‌వాడి కేంద్రాల పనితీరును పర్యవేక్షణ చేసేందుకు 149 ఐసీడీసీ ప్రాజెక్టులను ఏర్పాటుచేసింది. అంగన్‌వాడి కేంద్రాల ద్వారా 4.72 లక్షలమంది మహళలు, బాలింతలు లబ్ది పొందుతున్నారు. అలాగే ఆరేళ్లలోపు వయసు ఉన్న 17.63 లక్షల మంది చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళికి అనుగుణంగా గర్భిణీ మహళలకు బాలింతలకు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించుటకు ప్రతి రోజు ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వం రూ.24.77లు ఖర్చు చేస్తున్నది. అంగన్‌ వాడి కేంద్రాల పనితీరుపై లబ్దిదారులు, ప్రజల స్పందనలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అంగన్‌వాడి హల్ప్‌లైన్‌ నెం.155209ను నెలకొల్పింది. అంగన్‌వాడి కేంద్రాల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పటిష్టంగా అమలు చేస్తున్నది. తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న పిల్లల, ఆరోగ్య సంరక్షణకు బాలామృతం కార్యక్రమం ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ, అదనపు ఫీడింగ్‌ పథకాన్ని కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్నది. అత్యవసర పరిస్థితులలో చిక్కుకున్న పిల్లలను తరలించి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 33 బాలరక్షక్‌ వా#హనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కృషి ఫలితంగా 2022 నాటికి మాతమరణాల రేటు జాతీయ సగటు 103 కంటే తక్కువగా 56గా నమోదైంది. శిశు మరణాల రేటు దేశ సగటు కంటే 32 తక్కువగా తెలంగాణలో 23గా ఉంది. ఆసుపత్రులలో ప్రసవాలు 2014లో 91 శాతం ఉండగా 2022లో 97 శాతంగా నమోదైంది. దేశ సగటు 79 కంటే ఎక్కువ శాతం ఆసుపత్రులలో ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో 2014లో ప్రసవాల రేటు 30 శాతం కాగా 2022లో 56 శాతానికి పెరిగింది.


మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయసుగల పిల్లలకు డిజిటల్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ను అందించుటకు టీశాట్‌ విద్యా ఛానల్‌ ద్వారా ప్రతిరోజు గంటపాటు ప్రత్యేక విద్య కార్యక్రమాలను ప్రభుత్వం ప్రసారం చేయిస్తున్నది. యానిమేషన్‌, ప్లేవే లెర్నింగ్‌ పద్ధతిలో ప్రసారం చేస్తున్న ఇ-విద్య కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారుల సంఖ్య నాలుగు లక్షల వరకు ఉంది. అంగన్‌వాడి కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పింది. ఐఎస్‌వో 2000: 2005 సర్టిఫికేట్‌ పొందిన తెలంగాణ ఫుడ్స్‌ ద్వారా ఉత్పత్తి చేసిన బాలామృతంతో పాటు పోషక విలువలున్న విటమిన్లు, మినరల్స్‌ కలిగిన ఆహారాన్ని స్నాక్స్‌గా ఆరేళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ఆధునిక పద్ధతిలో ప్యాకింగ్‌ చేసిన బాలామృతం ఆహారాన్ని తెలంగాణలోని అంగన్‌వాడి కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా తెలంగాణ ఫుడ్స్‌ సరఫరా చేస్తున్నది. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్‌వాడి ఉద్యోగుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ప్రధాన అంగన్‌వాడి టీచర్‌కు రూ.13,650, మినీ అంగన్‌వాడి టీచర్‌, హల్పర్స్‌కు రూ.7800 ప్రతినెల గౌరవవేతనంగా చెల్లిస్తున్నది. అంగన్‌వాడి కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. అలాగే అటు చేనేత రంగాన్ని ప్రోత్సహంచడంలో భాగంగా అంగన్‌వాడి టీచర్లు, హల్పర్స్‌కు 67411 పోచంపల్లి చేనేత చీరలను ప్రభుత్వం పంపిణీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement