Monday, April 29, 2024

TS : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్… బైఠాయించిన‌ బీఆర్ఎస్ కార్యకర్తలు

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన త‌ర్వాత విపక్షాల నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద పోలీసులు అడ్డుకుని మాజీ ఎమ్మెల్యేను పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బాలరాజును విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్‌ నాయకులను అణచివేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement