Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ రాజీనామా..

వైరా, ఏప్రిల్ 19 (ప్రభ న్యూస్): వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లెటర్ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పంపించారు. వైరా నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా లెటర్ పంపించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2018 సంవత్సరంలో ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి మదన్ లాల్ పై గెలుపొందారు. 2023 ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లని.. తనకు టికెట్ ఇవ్వకుండా మదన్ లాల్ కు టిక్కెట్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తనకు టికెట్ ఇవ్వకుండా తనపై ఓటమిపాలైన మదన్ లాల్ కు టికెట్ ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు బుజ్జగించినప్పటికీ రాములు నాయక్ వినకపోవడం, నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లెటర్ ను ఆయన ఫ్యాక్స్ ద్వారా పంపించారు. దీంతో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లోని రాములు నాయక్ అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి వైరా నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో రాములు నాయక్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement