Tuesday, May 28, 2024

Flash News – సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమల బంద్ ఉపసంహరణ

సిరిసిల్ల, జనవరి 18 (ప్రభ న్యూస్) : గత నాలుగు రోజులుగా బందు పాటిస్తున్న సిరిసిల్ల పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమలను శుక్రవారం నుండి వస్త్ర ఉత్పత్తులను పునః ప్రారంభిస్తున్నట్టు సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. గురువారం సాయంత్రం పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల సత్యం అధ్యక్షతన పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనంలో జరిగిన అత్యవసర సమావేశంలో సభ్యులందరి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వస్త్ర పరిశ్రమ గత నాలుగు రోజులుగా బంద్ ఉన్న సందర్భంలో పరిశ్రమకు సంబంధించిన ఆసాములు, కార్మికులు అలాగే అనుబంధ పరిశ్రమ కార్మికుల సంక్షేమం కొరకు తాము వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దల పక్షాన తమ సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈనెల 19 శుక్రవారం నుండి వస్త్ర పరిశ్రమల బందును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement