Monday, February 19, 2024

Suspend: డ‌బ్బు పంచుతూ అడ్డంగా దొరికిన ఎక్సైజ్ సిఐ అంజిత్ రావు సస్పెండ్

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో డబ్బులు పంచుతూ దొరికిపోయిన వరంగల్ ఎక్సైజ్ అధికారి అంజిత్ రావును ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. నిన్న చెంగిచర్ల క్రాస్ రోడ్‌ దగ్గర కారులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు లభ్యమయ్యాయి. బీఆర్‌ఎస్‌ నేతలు… కారులో డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. కాంగ్రెస్‌ నాయకులు కారును అడ్డగించారు.

కారులో 5 వందలు, 2 వందల నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా.. సీఐ అంజిత్‌ రావు పేరుతో ఉన్న ఐడీ కార్డు లభ్యమైంది. పోలీసు అయ్యి ఉండి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డబ్బులు పంచుతున్నారన్న కోపంతో కాంగ్రెస్‌ నేతలు అంజిత్‌రావును నిలదీశారు. వెంటనే సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు.. డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్‌ అధికారి అంజిత్‌ రావును సస్పెండ్‌ చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement