Monday, March 4, 2024

Erravalli – ఫాంహౌస్‌ లో కెసిఆర్ ను కలిసిన చింతమడక గ్రామస్తులు – గెలిచినా, ఓడినా మీరే మా సీఎం అంటూ నినాదాలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును బుధవారం ఆయన స్వగ్రామం చింతమడకకు చెందిన గ్రామస్తులు కలిశారు. బుధవారం దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వచ్చారు..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును బుధవారం ఆయన స్వగ్రామం చింతమడకకు చెందిన గ్రామస్తులు కలిశారు. బుధవారం దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వచ్చారు. అయితే భద్రతా కారణాల రీత్యా పోలీసులు వారిని చెక్‌పోస్ట్ వద్దే ఆపేశారు. లోపలి నుంచి అనుమతి వస్తేనే పంపుతామని చెప్పడంతో దాదాపు 2 గంటల పాటు వేచే వున్నారు.

అనంతరం లోపలి నుంచి ఆదేశాలు అందడంతో వారిని అనుమతించారు. తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్ ప్రజలకు అభివాదం చేసి పలకరించారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఆయనను చూడగానే కేసీఆర్ జిందాబాద్.. సీఎం , సీఎం అంటూ నినాదాలు చేశారు. కొంతమంది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement