Wednesday, October 16, 2024

వ‌రంగ‌ల్‌లో ఇంజ‌న్ ఆయిల్ మోసం.. ఫేక్ ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ ప‌ట్టివేత‌

వరంగల్ జిల్లాలో ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ భారీగా ప‌ట్టుబ‌డ్డాయి. ఇంజన్ ఆయిల్ బాటిల్స్ కి స్కిక్క‌ర్స్ వేసి అమ్ముతున్నారన్న‌ పక్కా సమాచారం మేరకు వ‌రంగ‌ల్ సిటీ, హంటర్ రోడ్డులోని సంతోషిమాత ఏరియాలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జ‌రిపారు. దీంతో ఆ ఇంట్లో భద్రపరిచిన ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ ని ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఇద్దరు నిందితుల‌ను అదుపులో తీసుకొన్నారు. వారి వద్ద నుండి 6.87 ల‌క్ష‌ల రూపాయలు విలువైన‌ ఫేక్ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్న‌ట్టు టాస్క్‌ ఫోర్స్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడుల్లో అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ , సీఐలు సంతోష్ , శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement