Wednesday, February 21, 2024

Elections : హైదరాబాద్‌ లో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా నవంబర్‌ 29, 30 (బుధవారం, గురువారం) స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

నవంబర్‌ 30 (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement