Friday, May 3, 2024

తెలంగాణ‌లో డిజిట‌ల్ విప్ల‌వం.. ఆగ‌స్టు 4న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిజిటల్‌ పాలనతో ఇతర రాష్ట్రాలకు మార్గరద్శిగా నిల్చిన తెలంగాణ తన సిగలో మరో కలికితురాయిని ఇముడ్చుకునేందుకు సిద్ధమవుతున్నది. ఆగష్టు 4న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా అత్యాధునిక సాంకే తికతతో నిర్మితమై పోలీస్‌ శాఖతోపాటు, ఇతర విపత్తులకు పరిశోధన కేంద్రంగా భాసిళ్లనున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభానికి నోచుకుం టోంది. 19 అంతస్థులతో అద్భు త డిజైన్‌తో నిర్మించిన ఈ భవనం తెలం గాణకు మరో అదనపు ఆకర్షనగా మార నుంది. ఈ కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో 19 అంత స్థులు నిర్మించగా, 14, 15వ అంతస్తుల వరకు ప్రజలను అనుమతించ నున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌ అందాలను వీక్షించేందుకు వీలు కల్గనుంది. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌ 1,12,077 చదరపు కిలోమీటర్లను కవర్‌ చేయనుంది. తెలంగాణలోని ప్రతీ ఇంచును 360 డిగ్రీల కోణంలో వీక్షించి పోలీస్‌లకు మేలు చేయనుంది. ఇందుకు పోలీస్‌ రాడార్‌ సేవలను వినియోగించ నున్నారు. క్షణాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏమి జరిగినా తెలుసుకునేందుకు అత్యంత ఆధునిక పరాజ్ఞా నాన్ని ఈ కేంద్రంలో వాడుతున్నారు. మొదట్లో ఈ భవనాన్ని రూ. 350కోట్లతో అంచనా వేసినప్పటికీ పెరిగిన ధరలతో మరో రూ. 235కోట్లు అదనంగా ఖర్చయ్యాయి. దీంతో మొత్తం వ్యయం రూ. 585కోట్లకు చేరింది. ఇందులో ఐదు టవర్లు ఉన్నాయి. టవర్‌ ఏ లో హైదరాబాద్‌ సీపి ఆఫీస్‌, టవర్‌ బీలో టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌ ఉంది. ఈ సెంటర్‌లో ఎమర్జెన్సీ మేనేజ్‌మె ంట్‌ రెస్పాన్స్‌ సిస్టం పనిచేయనుంది. డయల్‌ 100 వార్‌రూం కూడా ఇక్కడినుంచే నడుస్తుంది.

శాంతి భద్రతల పరిరక్షణతో రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిని పరుగులు పెట్టించేలా ఇక్కడినుంచి డిజిటల్‌ పద్దతిలో పాలన సాగనుంది. రాష్ట్రంలో దాదాపు 10లక్షలకుపైగా సీసీ కెమెరాలను పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలన్నీ ఇకపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఇక్కడినుంచే పర్యవేక్షణ కొనసాగనుంది. ఇక్కడినుంచి రాష్ట్రం మొత్తం వీక్షించినున్నారు. ఇందులోనే సర్వర్లు, డబుల్‌ హైట్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యాలు, సర్వైలెన్స్‌ కెమెరా ఫుటేజీకి చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్‌ పోలీస్‌లకు ఇక్కడినుంచి బ్యాక్‌ఎండ్‌ సపోర్టు లభించనుంది. ఇక్కడి నుంచి వరదలు, విపత్తులు, భారీ వర్షాలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు వంటివి సంభవించిన సమయంలో క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌, విపత్తు నిర్వహణ సేవలు అందించనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఇక్కడినుంచి అనుసంధానం ఉండనుంది. స్పెషల్‌ ఇంటలిజెన్స్‌, డేటా అనలిస్ట్‌, సోషల్‌ మీడియా యూనిట్లువంటి సేవలుపై నిఘా ఇక్కడినుంచే కొనసాగి స్తారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన అంతా డిజిటల్‌ రూపంలో ముఖ్యమంత్రి ఎదుట ప్రత్యక్షం అయ్యేలా కార్యాచరణ చేపట్టారు. తెలంగాణ అధికారిక పాలన అంతా ఎలక్ట్రానిక్‌ డిజిటలైజ్‌ చేసేందుకు సర్కార్‌ కార్యాచరణ చేసింది. ఏ మూలన ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా సాంకేతిక ఏర్పా ట్లను సమకూ ర్చుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా డిజిటల్‌ రూపంలో కేంద్రీకృతం చేసేందుకు సన్నా హాలు జరుగుతున్నాయి. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌తోపాటు, సచివాయంలో ఈ అధునాతన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కొత్తగా నిర్మిత మవుతున్న సచివాలయం దసరా నుంచి ఉనికి లోకి రానున్నది. అయితే ఈ మేరకు భవిష్యత్‌ అవసరాలకు ధీటుగా సాంకేతికతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.
వచ్చే నెల 4నుంచి అందుబాటులోకి రానున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, కార్యాలయాల్లో డిజిటల్‌ కాన్ప éరెన్సి ంగ్‌ సౌకర్యాలను కల్పిస్తున్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ సౌలభ్యాన్ని మరింత ఆధునీ కరించే కసరత్తు జరుగుతోంది. వీడి యా కాలింగ్‌ సౌకర్యానికి శాటిలైట్‌ నెట్‌ వర్క్‌ వినియోగంతోపాటు, దస్త్రాల్‌ ట్రాకింగ్‌ సిస్టంను కూడా ఆధునీకరిం చాలని సర్కా ర్‌ నిర్ణయించింది. ప్రతీ ఫైల్‌ను బార్‌ కోడింగ్‌ చేసి దాని స్థితిగతు లను ఎప్పటి కప్పుడు పరిశీలించడం ద్వారా పెండిం గ్‌లను నివా రించి పారద ర్శకత పెంచే చర్యలను చేపడుతోంది. ఇక ప్రభుత్వ సమాచారం, శాఖల్లోని కీలక అంశాలను ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్‌ చేసేలా సాంకేతికను విని యోగంలోకి తేనుంది. తద్వారా సమాచార సేకరణ సులువవుతుందని ప్ర భుత్వం భావిస్తోంది. జిల్లా కలెక్టరేట్లలో డీడీఆర్‌సి సమావే శాలు, ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్‌ల తీరుతెన్నులను నేరుగా ప్రభుత్వం వీక్షించనుంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతి, విపత్తుల సమయంలో సర్కార్‌ ఆదేశాలు, సహాయ చర్యల పరిశీలన, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ అంతా వీడియో రూపంలో నేరుగా వీక్షించే వెసులుబాటు అందుబాటులోకి తేనున్నారు. దీంతో పాలనలో జాప్యం, నిర్లక్ష్యం తొలగనుందని అంచనా వేస్తున్నారు. క్రమంగా వివిధ శాఖలు, అసెంబ్లి వంటి కీలక అన్ని విభాగాల్లో ఈ-పాలనను అమలులోకి తెచ్చేలా ప్రయ త్నాలు ముమ్మర మయ్యాయి. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌తో మరోసారి కాగితపు రహిత పాలనతో వచ్చే లాభాలు, సమాచార గోప్యత వంటి అంశాలపై గుడ్‌ గవర్నెన్స్‌ (సుపరిపాలన శాఖ) నివేదికను సిద్దం చేసింది. సత్వర పాలన, మెరుగైన ఫలితాలు డిజిటల్‌ పాలనతోఅందుబాటు లోకి వస్తాయన్న గుడ్‌ గవర్నెన్స్‌ సూచనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం తాజాగా ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేసింది. గుడ్‌ గవర్నెన్స్‌ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ-పాలన దిశగా కసరత్తును ముమ్మరం చేసి, ప్రభుత్వ పాలనకు మెరుగైన ఆన్‌లైన్‌ శాస్త్ర సాంకేతిక అప్లికేషన్లను రూపొందించింది. తద్వారా ప్రభుత్వ నిర్ణయాల సత్వర అమలు, ప్రగతి పరిశీలన, కేబినెట్‌ నిర్ణయాల్లో గోప్యత ఉండేలా ఈ అప్లికేషన్‌లో అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.

గతంలో ప్రయోగాత్మకంగా…
గతంలో కేబినెట్‌ సమావేశాల్లో ప్రయోగాత్మకంగా అప్లికేషన్‌ను వాడినట్లు అధికారులు తెలిపారు. ఈ అప్లికేషన్‌ ఇచ్చిన సత్ఫలితాల అనుభవంతో మరింత మెరుగ్గా మరిన్ని అదనపు సదుపాయాలతో అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిసింది. ఇది అందుబాటులోకి వస్తే మంత్రులు, సెక్రటరీలకు సమాచారంతోపాటు ఎజెండా, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సంక్షేమ పథకాలు, వాటి అమలు, గతంలో నిర్వహించిన ప్రభుత్వ సర్వే వివరాలు వారి ముగిటే క్షణాల్లో ప్రత్యక్షం కావడంతో పాటు ప్రభుత్వ ప్రగతి, మంత్రుల అభిప్రాయాలు, స లహాలు స్వీకరణ అంతా ఈ అప్లికేషన్‌ ద్వారా సేకరించేం దుకు సులువు కానుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement