Wednesday, May 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో అప్పు వివాదం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం ఒక రైతు మరో వ్యాపారి మధ్య వివాదం చోటు చేసుకుని పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాకు చెందిన బూతం యాకయ్య అనే రైతు మార్కెట్ లో ఓ కమిషన్ వ్యాపారి వద్ద గతంలో అప్పు తీసుకున్నట్లు సమచారం. డబ్బులు చెల్లించకుండా వాయిదాలు పెడుతున్నారు. ఈరోజు మార్కెట్ కు మిర్చి అమ్మకానికి తెచ్చి సదరు వ్యాపారికి కాకుండా ఇతరులకు మిర్చి బేరం పెట్టాడు. దీంతో రైతుకు అప్పు ఇచ్చిన వ్యాపారి చెల్లింపుల కోసం నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. తన అప్పు చెల్లించకుండా మిర్చిని అమ్మనీచ్చేది లేదని సదరు వ్యాపారి తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో స్వల్పగా వాగ్వాదం చోటుచేసుకోగా.. మార్కెట్ సిబ్బంది ఇరువురిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎవరు వినకపోవడంతో బాధిత రైతు ఖమ్మం త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదం విషయంపై మార్కెట్ సెక్రటరీ మల్లేశంను వివరణ కోరగా, ఇటువంటి సంఘటనలు మార్కెట్లో ప్రతి రోజూ జరుగుతూనే ఉంటాయని, రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా వచ్చిన విషయం అవాస్తవం అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement