Friday, May 24, 2024

Crime News – ఔట‌ర్ రింగ్ రోడ్డుపై మూట‌లో శ‌వం… వికారాబాద్ లో మ‌హిళ దారుణ హ‌త్య

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ పల్లీ ఔటర్ రింగురోడ్డు సమీపంలో మూటలో మృతదేహం కలకలం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి కిందకి గుర్తుతెలియని వ్యక్తులు పారేశారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాం నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు..

వికారాబాద్ లో మహిళ హత్య

గుర్తుతెలియని మహిళను దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా గ్రామం పుల్ మద్ది శివారు పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ మండలం పులమద్ది అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు మహిళను గుర్తుపట్టని విధంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ తో, జాగిలాలతో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గుర్తు తెలియని మహిళ హత్యకు ముందు ఆమెను అత్యాచారం చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం గుర్తు పట్ల‌కుండా ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.. మృతదేహాం వ‌ద్ద ఆకు పచ్చ జాకెట్ పచ్చని కలర్ చీర ల‌భించింది. ఆమె వయస్సు దాదాపు 30, నుండి 35 సంవత్సరాలు ఉంటుందని సంఘటన జరిగి రెండు రోజులు జరిగి ఉండవచ్చు అని పోలీసులు అ నుమానిస్తున్నారు. వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

నార్సింగ్ లో వాచ్ మెన్ దారుణ హ‌త్య‌

ఇర నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో వాచ్ మెన్ దారుణ హత్య జరిగిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలకు ప్రకారం ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణంలో జంగయ్య వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అలాగే అక్కడే అర్జున్ అనే వ్యక్తి తాపీ మేస్త్రి గా పనిచేస్తున్నారు. నిర్మాణ యజమానికి తెలియకుండా అర్జున్ గత కొన్ని రోజులుగా స్క్రాప్‌ను అమ్ముకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వాచ్‌మెన్ పలుమార్లు తాపీ మేస్త్రి అర్జున్‌ను హెచ్చరించారు. తీరు మార్చుకోకుండా మళ్లీ స్క్రాప్‌ను అమ్ముతుండడంతో అది గమనించిన వాచ్‌మెన్ జంగయ్య ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ చెప్పాడు. దీంతో నిర్మాణ యజమాని తాపీ మేస్త్రీ అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్జున్ మద్యం సేవించి ఆగ్రహంతో వాచ్‌మెన్ జంగయ్యను ఇనప కడ్డీతో తలపై బాది హత్య చేసి పరారయ్యాడు . పోస్టుమార్టం నిమిత్తం జంగయ్య మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement