Sunday, April 28, 2024

TS : జారిపడ్డ సీపీఐ నారాయణ… విరిగిన తుంటి ఎముక

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ స్వల్ప అనారోగ్యాన్ని గురయ్యారు. ఆయనకు పరిశీలించిన ఏఐజి డాక్టర్లు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈనెల 16వ తేదీన కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంలో వివాహ వేదిక ఎక్కుతుండగా నారాయణ జారి పడ్డారు. అయితే అప్పుడు ఆయన స్వల్పంగా గాయాలయ్యాయి.

అయిన పట్టించుకోలేదు. వివాహాంలో పాల్గొన్న ఆయన మళ్లీ అక్కడి నుంచి విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో నారాయణకు రిబ్ ఎముక వద్ద నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించారు. నారాయణను పరిశీలించిన వైద్యులు రిబ్ ఎముక విరిగినట్లు నిర్ధారించారు. నారాయణకు రెండు వారాలపాటు విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

లేదంటే నొప్పి ఎక్కువ అవుతుందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని వారి నివాసంలో నారాయణ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తను బాగానే ఉన్నట్లు తెలిపారు. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యం చేయించుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు తెలిపారు. అయితే నారాయణ ఆరోగ్యం పట్లు తెలుసుకునేందుకు సీపీఐ పార్టీ నేతలు ఇంటికి క్యూ కట్టారు. నారాయణ ఆరోగ్యం పై ఆరా తీసారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. నారాయణ అందరితో బాగానే మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. భయపడాల్సిన పనిలేదని ఆయన ఆరోగ్యం కుదుట పడగానే ప్రజల్లో ముందుకు రావాలసి ఆశిస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement