Sunday, June 23, 2024

TS: నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం.. విప్ బాల్క సుమన్

చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంతో పాటు మరో రెండు నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని గతంలో వాగ్దానం చేశామన్నారు.

ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బుధవారం చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా చెన్నూరు మండలంలోని అస్నాద్, కొటపెల్లి మండలం పారుపెల్లి గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను మహిళలకు, క్రీడాకారులకు క్రీడా కిట్లను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement