Tuesday, June 4, 2024

Congress – కృత‌జ్ఞ‌త ఏదీ? భ‌ట్టిపై వీహెచ్ ఆగ్ర‌హం

అత‌డిని రాజ‌కీయాల్లోకి తెచ్చిందే నేను
ఇప్పుడు ఖ‌మ్మం సీటుకు అడ్డుకుంటున్నారు
సీనియ‌ర్ లీడ‌ర్‌ని అడుక్కునే స్థితికి తెచ్చారు
భ‌ట్టి తీరుపై భ‌గ్గుమ‌న్న వీహెచ్‌

ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్కను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, అయినా ఆయనకు కృతజ్ఞత లేదని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు మండిపడ్డారు. తనకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్రచేస్తున్నారని ఆరోపించారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారం చేస్తున్న వారిపై చ‌ర్య‌లు కోరుతూ శ‌నివారం అంబర్‌పేటలోని తన నివాసంలో దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాగా, తాను ఖ‌మ్మం సీటు అశించాన‌ని, అయితే.. అందుకు భ‌ట్టితో స‌హా ప‌లువురు అడ్డుప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. త‌న‌లాంటి సీనియ‌ర్ నేత కూడా సీటు కోసం అంద‌ర్నీ అడుక్కోవ‌ల‌సిని ప‌రిస్థితికి తెచ్చారంటూ వాపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement