Saturday, May 28, 2022

ఖమ్మం నుంచే కేసీఆర్ పై దండయాత్ర : రేణుక హెచ్చరిక

గత కొద్ది రోజులుగా రాజకీయాలు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై రేణుకా చౌదరి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఖమ్మం జిల్లా నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై దండయాత్ర ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. చైనా కవ్వింపులకు పాల్పడుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. మోదీకి కుటుంబ బాధ్యతలు తెలియవని… తెలిసుంటే ధరల పెరుగుదలతో కుటుంబాలు పడుతున్న ఇబ్బంది ఆయనకు అర్థమయ్యేదని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు వెళ్లిన నేతలందరూ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని రేణుక చౌదరి ధీమా వ్యక్తం చేశారు.  

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక ఆలస్యం కానుందా? ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమంటున్నాయి?

Advertisement

తాజా వార్తలు

Advertisement