Wednesday, July 24, 2024

Confident – ఇండియా కూట‌మి వైపే ఓట‌ర్లు – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

లోక్ స‌భ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్ధమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో సుమారు 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన బస్సుయాత్ర, పాదయాత్రతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడపోతుందని పేర్కొన్నారు. రాహుల్ పోరాటాల ఫలితాలు.. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రజలు ఓట్ల ద్వారా చూపిస్తున్నారని తెలిపారు. కొన్ని పార్టీలు అన్ని భావజాలలను పక్కనపెట్టి ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి చూసాయని ఆరోపించారు. ప్రజలు మాత్రం ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని భట్టి విక్కమార్క చెప్పారు.

ధన్వాడలో మంత్రి శ్రీధర్ బాబు స్వగృహంలో భ‌ట్టి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలని ప్రజల ఆస్తులు దేశానికే అందాలని ఎన్నికల్లో పాల్గొన్నారని తెలిపారు.

- Advertisement -

అంత‌కు ముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, అడ్డురి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలను స్వామి వారి శేష వస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం.. స్వామి వారి తీర్థ్ర ప్రసాదాలను అర్చకులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement