Tuesday, May 14, 2024

Confident – హ్యాట్రిక్‌ లోడింగ్‌ 3.0..వేడుకలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి – కేటీఆర్

హైదరాబాద్ – . గెలుపుపై అటు కాంగ్రెస్‌ ధీమాగా ఉంటే. బీఆర్‌ఎస్‌ మాత్రం గెలిచేది తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌లను తలకిందులు చేస్తూ డిసెంబర్ 3వ తేదీన కారు దూసుకెళ్తోందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ ఎగ్జిట్ పోల్స్‌ విడుదల తర్వాత ఆసక్తిర ట్వీట్ చేశారు. “చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయాను… ఎగ్జిట్ పోల్స్ పెరగొచ్చు.. కానీ ఎగ్జాట్ ఫలితాలు మాకు శుభవార్తను చెబుతాయి” అంటూ ‘X'(‘ట్విటర్)లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలు మిగిలి ఉన్న నేపథ్యంలో కేటీఆర్‌ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌.. ‘హ్యాట్రిక్‌ లోడింగ్‌ 3.0. వేడుకలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో కార్యకర్తల్లో, నాయకుల్లో కేటీఆర్‌ జోష్‌ నింపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement