Friday, May 3, 2024

Crime: నార్సింగ్‌లో క‌ల‌క‌లం…కారులో మృతదేహం

హైదరాబాద్‌ మణికొండ లోని ఓ కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మారుతి కారులో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. ఈ తరుణంలోనే…డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది నార్సింగ్ పోలీసులు, క్లూస్ టీమ్. ఇక కారులో మృతదేహం వెలికితీశారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. స్థానికంగా ఉన్న సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలీస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement