Friday, May 3, 2024

Sexual harassment: అర్ధ‌రాత్రి విద్యార్థి గ‌దికి కాలేజ్ ఛైర్మ‌న్‌… లైంగిక దాడికి య‌త్నం

రోజు రోజుకు మ‌హిళ‌ల‌కు లైంగిక వేధింపులు ఎక్కువ‌వుతున్నాయి. చిన్న‌, పెద్ద తేడా లేకుండా కీచ‌కులు లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా ఓ గిరిజన విద్యార్థిని పై కాలేజ్ ఛైర్మ‌న్ లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు.

అర్థ‌రాత్రి హాస్ట‌ల్‌లో విద్యార్థిని నిద్రిస్తున్న స‌మ‌యంలో ఆ కీచ‌క ఛైర్మ‌న్ ఆమె గ‌దికి వెళ్లి లైంగిక దాడికి య‌త్నించాడు. ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె భ‌యాందోళ‌న‌కు గురై కేక‌లు వేయ‌డంతో తోటి స్టూడెంట్లు నిద్ర‌లేచారు. విద్యార్థిని కేక‌ల‌కు లేచిన తోటివారిపై మండిప‌డుతూ వారిపై చేయిచూసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి వెళ్లిపోయాడు. ఈఘ‌ట‌న‌ హనుమకొండ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హసన్‌పర్తి మండలం భీమారంలోని తెలంగాణ శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన పదహారేళ్ల విద్యార్థిని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రోజున కళాశాల ఛైర్మన్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర సురేందర్‌గౌడ్‌ అర్ధరాత్రి ఒంటి గంట దాటాక హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో హాస్టల్‌ గదిలో నిద్రిస్తున్న ఆ విద్యార్థిని పట్ల లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న తోటి విద్యార్థినులు నిద్రలేచి బయటకు రాగా తన స్నేహితులకు ఆమె జరిగిన విషయం చెప్పింది. ఈ క్రమంలో కోపగించిన సురేందర్‌ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ విద్యార్థినులపై చేయి చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement