Wednesday, October 16, 2024

Breaking: ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేశారు. ఆరు గ్యారెంటీల ఫైలుపై సంతకం చేసిన అనంతరం రెండో సంతకం దివ్యాంగురాలు రజిని నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. ఎల్బీనగర్ లో నిర్వహించిన సభలో ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తొలి సంతకం ఆరు గ్యారెంటీలపైనే చేశారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు.
మహాలక్షి పథకం..
మహిళకు ప్రతి నెలా రూ. 2500 తోపాటు.. రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా దీనిని రూపొందించారు.
రైతు భరోసా..
ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15,000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 తమ ఖాతాల్లో జమ చేసేలా గ్యారెంటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటూ వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది.
గృహజ్యోతి పథకం..
తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అలాగే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం..
ఇళ్లు నిర్మించుకుంటామనే ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
యువ వికాసం..
యువతీ, యువకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డు అందజేస్తామన్నారు. దీని ద్వారా కళాశాల విద్య పూర్తి చేసిన యువతకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజులు చెల్లించనున్నారు. అదే విధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తామన్నారు. ఈ ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు.


- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement