Monday, June 17, 2024

నేడు వేల్పూర్‌కు వెళ్లనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఇవాళ నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన ప్రగతిభవన్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మంజులమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement